Mrunal Thakur: నేను సినిమా ఇండస్ట్రీలోకి రావటం నా పేరెంట్స్ కి ఇష్టం లేదు: మృణాల్ ఠాకూర్

0
57

Mrunal Thakur: సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మి పాత్రలో నటించిన తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట హిందీ సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది.

ఒక క్లాసికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో హీరోయిన్ గా మృణాల్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

సీతామహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయిన మృణాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా హీరోయిన్ గా మంచి గుర్తింపు రావడంతో ప్రస్తుతం టాలీవుడ్లో మృణాల్ కి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇలా ప్రస్తుతం హింది , తెలుగు భాషలలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది. ఈ అమ్మడు ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తు బిజిగా ఉంది.

Mrunal Thakur: చాలా సంతోషిస్తున్నారు..


ఇటీవల ఒక వేదికపై మాట్లాడిన మృణాల్ తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతే కాకుండా తాను సినిమా రంగంలోకి రావడం తన తల్లీ తండ్రులకు ఇష్టం లేదని, అందుకే వారు తనని సపోర్ట్ చేయలేదని తెలిపింది. ఈ మేరకు మృణాల్ మాట్లాడుతూ..” మారి మరాఠీ కుటుంబం. నేను సినిమాలలోకి రావటం నా పేరెంట్స్ కి ఇష్టం లేదు. ఎందుకంటె వారికి ఈ సినిమా ఇండస్ట్రీ గురించి తెలియదు. అందుకే ఏం జరుగుతుందో అని భయపడ్డారు. కానీ ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇక ఇప్పుడు నా పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు ‘ అంటూ చెప్పుకొచ్చింది.