Mrunal Thakur: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సమంత, నయనతార స్టార్ హీరోయిన్లుగా మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఇటీవల సీతారామం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.మొదటి సినిమాకే ఇంత క్రేజ్ రావటం మృణాల్‌కు మాత్రమే సాధ్యమైంది. సీతారామం సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇలా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ కి అవకాశాలు వరుస క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ ఠాకూర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతారని కూడా మించిపోయిందని తెలుస్తోంది. సీతారామం సినిమాకి రెండు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న మృణాల్ నానితో నటించబోతున్న సినిమాకి 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. .ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న సమంత, నయనతార రెమ్యూనరేషన్ కూడా ఆరు కోట్లకు లోపే ఉంటుంది.

Mrunal Thakur: హాట్ టాపిక్ గా మృణాల్ రెమ్యూనరేషన్..
మృణాల్ మాత్రం ప్రస్తుతం సౌత్ లో తనకు ఉన్న డిమాండ్ బట్టి 6 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసం అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి మృణాల్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.






























