Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. సీతారామం సినిమాలో సీత మహాలక్ష్మి పాత్రలో ఎంతో వినయంగా ఒద్దికగా నటించి ఎంతోమంది తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా పెళ్లి పిల్లల గురించి ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఒక అమ్మాయికి 30 సంవత్సరాలు వచ్చాయి అంటే ఆమెప్రేమ పెళ్లి పిల్లలు వంటి విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.
పెళ్లి అంటే మన జీవిత భాగస్వామి మన అన్ని విషయాలలోనూ మనల్ని ఎంతో అర్థం చేసుకోవాలి. మన మనసును మనం చేసే వృత్తిని గౌరవించాలి. ప్రస్తుతం ఉన్న అభద్రత కాలంలో మనల్ని సంరక్షించే వ్యక్తి దొరికినప్పుడు తాను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అయితే అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారని ఈ సందర్భంగా ఈమె తెలిపారు. అలాంటి వ్యక్తి దొరకకపోతే తాను పెళ్లి చేసుకోనని ఈమె పెళ్లి గురించి కామెంట్ చేశారు.

Mrunal Thakur: అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది.
ఇక తాను జీవితంలో పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు కానీ తనకు మాత్రం అమ్మ అని పిలిపించుకోవాలని మాత్రం ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను పెళ్లి చేసుకోకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా తాను పిల్లల్ని కంటానని ఇదే నిర్ణయాన్ని తన తల్లితో చెప్పగా తన నిర్ణయాన్ని గౌరవించిందంటూ ఈ సందర్భంగా మృణాల్ ఠాగూర్ ప్రేమ పెళ్లి పిల్లలు వంటి విషయాల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























