Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఈ సినిమా విడుదలైన ఏడాది తర్వాత మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్న తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు. సీతారామం సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించి సందడి చేసిన ఈమె ఈ మధ్యకాలంలో గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా నటి మృణాల్ ఠాగూర్ నెటిజన్ల ట్రోలింగ్ అవుతున్నారు. ఈమె ఇలా ట్రోలింగ్ కి గురి కావడానికి గల కారణం ఆమె తనకు కాబోయే వ్యక్తి గురించి రెండు విధాలుగా సమాధానం చెప్పడమే.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె కాబోయే వాడు ఎలా ఉండాలి అని ప్రశ్నించగా తనకు కాబోయే భర్త పెద్దగా అందంగా లేకపోయినా మంచి వాడైతే చాలు అంటూ సమాధానం చెప్పారు. అయితే తాజాగా కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొన్న ఈమెకు మరోసారి తనకు కాబోయే భర్త గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తనకు కాబోయే భర్త అందంగా ఉండాలని సమాధానం చెప్పింది.

Mrunal Thakur: కపటత్వానికి మారుపేరు…
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ గత వీడియోని ఈ వీడియోని జత చేస్తూ కపటత్వానికి మారుపేరు మృణాల్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్లపై స్పందించిన నటి నాకు కాబోయే భర్త విషయంలో గతంలో ఇప్పుడు నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను ధైర్యంగా చెప్పాను.సెలబ్రిటీలు కూడా మనుషులే అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి అంటూ తన గురించి వస్తున్నటువంటి ట్రోలింగ్స్ పై ఈమె తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.































