Mrunal Thakur: హిందీ సీరియల్స్ లో నటిస్తూ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని బాలీవుడ్ కే పరిమితమైనటువంటి మృణాల్
ఠాకూర్ తెలుగులోకి సీతారామం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.మొదటి సినిమానే ఇంత మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఈమెకు ఈ సినిమా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు.

మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ కుతెలుగులో వరుస అవకాశాలు వస్తాయి, ఇక ఈమె బిజీగా మారిపోతారు అని అందరూ అనుకున్నారు అయితే ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతున్న ఇంకా ఈమె తదుపరి సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ఇలా సీతారామం తర్వాత ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా తర్వాత తాను దర్శక నిర్మాతలను కలిసినప్పుడు వారు నాతో మాట్లాడుతూ మీరు సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. మీకు సినిమా అవకాశాలు ఇవ్వాలంటే సీతామహాలక్ష్మి పాత్ర కన్నా గొప్పగా ఉండాలి అలాంటి పాత్ర రాయడానికి కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పేవారని అందుకే తనకు గ్యాప్ వచ్చిందని తెలిపారు.

Mrunal Thakur: సీతా మహాలక్ష్మి పాత్ర కన్నా గొప్పగా ఉండాలి….
ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నాని 30అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాక త్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పనులు ప్రారంభమవుతాయి అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా ద్వారా మృణాల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
































