Mudragada: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే ఆయన కచ్చితంగా ఈ ఎన్నికలలో ఓటమిపాలు అవుతారని ఓడిస్తామని శపథం చేశారు. అలా పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడం ఎన్నికల ఫలితాలు రావడం పవన్ కళ్యాణ్ 70 వేల ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో అప్పట్లో శపథం చేసిన ముద్రగడ తన పేరు మార్పుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఈయన తాజాగా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నానని ఇకపై తాను కాపు కాదు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. ఇక ఈయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
పద్మనాభ రెడ్డి..
ఇలా మాట తప్పకుండా ముద్రగడ మాటమీద నిలబడి తన పేరును మార్చుకోవటంతో ఈ విషయంపై పలువురు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈయన పద్మనాభ రెడ్డిగా మారుతున్నానని ప్రకటించడంతో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఈయనని సామాజిక వర్గంలో చేర్చుకోము అంటూ అప్పట్లో వ్యతిరేకత కూడా ఏర్పడింది కానీ ఈయన పేరు మాత్రం పద్మనాభ రెడ్డిగా మారిపోయింది.





























