Mudragada: కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సిపి నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలబడతారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వచ్చారు..

పవన్ కళ్యాణ్ గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాబానికి తన కూతురు ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి. తన కుమార్తె క్రాంతి తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన మద్దతు పవన్ కళ్యాణ్ కి నన్ను ప్రకటించారు. ఇలా తన నుంచి తన కుమార్తెను వేరు చేయడంతో పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వృద్ధ నారి ప్రతివతలా కబుర్లు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ముద్రగడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మెగా కుటుంబంలోని ఒక అమ్మాయి నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని విషయం తెలిసి అతనిని ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ మండిపడ్డారు.
వంగా గీత కాపు కాదా..
వంగ గీత కాపు కాదా, నువ్వేనా కాపు? నువ్వు కచ్చితమైన కాపు అయితే నీ చరిత్ర బయట పెట్టు. నేను కచ్చితమైన కాపును.. కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియాలి. నీ ముగ్గురు భార్యలకు వైసీపీ తరఫున టికెట్ కావాలంటే నేను ఇప్పిస్తాను నన్ను నా కూతురు నుంచి కొన్ని దుష్టశక్తులు దూరం చేశాయని వచ్చే జన్మలోనే మళ్లీ మేం కలుస్తాం అంటూ ఈ సందర్భంగా ముద్రగడ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.





























