లవర్ కోసం కుర్రాడి వెర్రి ప్రశ్న.. పోలీసులు షాకింగ్ రిప్లై!

0
61

దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి పెరుగుతోంది.ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు నమోదు కావడంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కారణంగా యువకుడు తన ప్రియురాలిని ఎంతో మిస్ అవుతున్నానని, ఎలాగైనా తనని కలవాలని భావించాడు.ఈ క్రమంలోనే ఆ యువకుడు పోలీసులను ఓ విచిత్రమైన ప్రశ్న అడుగుతూ ముంబై పోలీసులకు ట్వీట్ చేశాడు.

లాక్ డౌన్ కారణంగా తన ప్రియురాలిని మిస్ అవుతున్నాను. తనని కలవడానికి బయటకు వెళ్లాలనుకుంటున్నాను. దీనికోసం బండిపై ఏ రంగు స్టిక్కర్ వాడాలి అంటూ ఆ యువకుడు ముంబై పోలీసులకు ట్యాగ్ చేశాడు.దీంతో ముంబై పోలీసులు కూడా ఎంతో సమయస్ఫూర్తితో ఆ యువకుడికి దిమ్మతిరిగే సమాధానం చెప్పారు.

ఈ పని మీకు చాలా ముఖ్యమైనదని మేము అర్థం చేసుకోగలం అంటూ టీజ్ చేస్తూనే… ఈ ప్రశ్న మా నిత్యవసర లేదా అత్యవసర జాబితాలో లేదని రిప్లై ఇవ్వడంతో పాటు..”దూరం బంధాలను ఎంతో బలపరుస్తాయి. ఇది చిన్న అడ్డం మాత్రమే త్వరలోనే ఈ అడ్డం ముగుస్తుంది. మీరు జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తున్నాం” అంటూ ముంబై పోలీసులు ఆ ప్రేమికుడు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని రీట్వీట్ చేశారు.ఈ విధంగా ముంబై పోలీసులు ఆ యువకుడికి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ విధంగా పోలీసులు చెప్పిన సమాధానం చూసిన నెటిజన్లు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here