సమంతాను అలా చూసి షాక్ అయ్యాను… – మురళీమోహన్

0
1246

తెలుగు ఇండిస్టీలో ఉన్న సినీ పెద్దల్లో సీనియర్ నటుడు మురళి మోహన్ ఒకరు. అప్పట్లో ఎన్నో హిట్ సినిమాలను అందించిన మురళీమోహన్ ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. తాజాగా నాగచైతన్య, సమంతలు ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖలు చేసారు. హైదరాబాద్ లో మురళీమోహన్ కు రియల్ ఎస్టేట్ మీద మంచి పట్టున్న సంగతి తెలిసిందే..

ఇటీవలే హైదరాబాద్ లోని ఒక ఏరియాలో 14వ అంతస్తులో స్విమింగ్ పూల్, జిమ్ తో పాటుగా సకల సౌకర్యాలతో మూడు ఇల్లు లను నిర్మిచుకున్నారట మురళిమోహన్. అందులో తాను గెస్ట్ హౌస్ గా వాడుకుంటున్న ఇల్లు నాగచైతన్యకు బాగా నచ్చడంతో తనకు అమ్మమని అడిగాడట. మొదట్లో ఆ ఇల్లు అమ్మెందుకు మురళి మోహన్ ఒప్పుకోలేదట. ఆ తరువాత నాగార్జున ఎంటరై మురళీమోహన్ కు ఫోన్ చేసి ఆ ఇల్లు చైతన్య కు బాగా నచ్చింది అతనికి అమ్మలంటూ విజ్ఞప్తి చేసాడట. నాగార్జున మాటలకూ కన్విన్స్ అయి తాను ఆ ఇల్లు చైతూకు అమ్మేశానని చెప్పారు మురళీమోహన్.

పక్కపక్క ఇళ్లలో ఉండేమేము. చైతన్య – సమంత లను తరచూ కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్లమని. అయితే ఒకరోజు జిమ్ చేయడానికి వెళ్లిన మురళీమోహన్ అక్కడ సమంత బరువులు ఎత్తుతుంటే చూసి ఆశ్చర్యపోయాను. ఆమె చాలా డెడికేషన్ కలిగిన వ్యక్తి నిజంగా అంత సన్నగా ఉన్న వ్యక్తి అన్ని బరువులు ఎవరు సింపుల్ ఎత్తలేరు. కానీ ఆ అమ్మాయి చాలా సునాయాసంగా బరువులు ఎత్తడం చూసి నేను షాక్ అయ్యాను అని గొప్పగా చెప్పుకొచ్చారు మురళీమోహన్..