Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మురళీమోహన్ గారు జగమే మాయ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రల్లో నటించారు. ఇండస్ట్రీ లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణం లో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించి పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటు సినిమా రంగంలోని అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు.

ఆ సినిమా వల్ల నష్టపోయాను… అతడు సినిమా విషయంలో జరిగింది అదే…..
జయభేరి చిత్ర నిర్మాణ సంస్థ మొదట గిరిబాబు గారి పేరు మీద ఉండగా ఆయన బ్యానర్ తీసేయాలని అనుకుంటున్న సమయంలో మురళి మోహన్ గారు అ ఆపేరును తీసుకుని ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలను నిర్మించారు. ఆయన బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో చాలా వరకు హిట్ సినిమాలే ఉన్నాయంటు తెలిపిన మురళి మోహన్ గారు అప్పటి వరకు సంపాదించిన డబ్బాంత కోల్పోయింది మాత్రం మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన తమిళ సినిమా ఇరువర్ సినిమాతో. ఇద్దరుగా ఆ సినిమాను తెలుగులో తీసుకువస్తే భారీ నష్టాలను మిగిలిచ్చింది అంటూ తెలిపారు.

ఇక అలాంటి నష్టం ఇంక ఏ సినిమాలోనూ రాలేదంటూ వివరించారు. ఇక మహేష్ బాబు హీరోగా అతడు సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో నిర్మించిన సమయంలో మొదట అనుకున్న బడ్జెట్ మించి సినిమా ధాటి పోవడం, అనుకున్న సమయానికి అప్పటి వరకు సినిమాను విడుదల చేసాం కానీ ఆ సినిమా విషయంలో బాగా ఆలస్యమైంది అంటూ అవే సమస్యలు తప్ప సినిమా నిర్మాణం మధ్యలో ఆపలేదు అంటూ తెలిపారు. సినిమా నిర్మాణ వ్యవహారాలన్ని మురళి మోహన్ గారి తమ్ముడు కిషోర్ గారే చూసుకుంటారు.






























