Murali Mohan – Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాల గురించి రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ జనసేన పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశిస్తూ కొందరు రాజకీయాలలోకి వస్తారు అయితే రాజకీయాలలో రాణించడం చేత కాకపోతే వెనక్కి వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు తనకు గెలుపు వచ్చిన ఓటమి వచ్చిన పార్టీని నమ్ముకుని కష్టపడుతున్నారు.

నా అంచనాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని అయితే ఎప్పుడు అవుతారు అనేది తెలియకపోయినా ఈయన మాత్రం కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని మురళీమోహన్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి జోక్యం చెప్పారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ రాజకీయ జీవితంపై జోస్యం చెప్పిన మురళీమోహన్…
ఈ విధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పుడు మా సినిమా పరిశ్రమ నుంచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని చాలా గర్వంగా ఫీల్ అవుతామని మురళీమోహన్ తెలిపారు. రాజమహేంద్రవరం నుండి తాను బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీమద్దతు తెలిపి తన తరపున ప్రచారం చేశారని ఈ సందర్భంగా మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.































