Murali Mohan : తెలుగు పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా మురళీ మోహన్ అందరికీ తెలుసు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా చిన్న సినిమాలతో మొదలై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జయభేరి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు. తన సినిమాలతో కొత్త హీరోయిన్లను పరిచయం చేసిన మురళీ మోహన్ ఎన్నో సినిమాల్లో హీరోగా మెప్పించాడు. అప్పట్లో మధ్యతరగతి అమ్మాయిలకు అతనే డ్రీమ్ బాయ్. ఇక చాలా మందికి పక్కింటి కుర్రాడు, తమ సోదరుడు, తండ్రి లాంటి భావన కలిగించేలా ఆయన నటన సహజంగా ఉండేది. ఇప్పటికీ సహ నటుడుగా, సినిమాల్లో అడపా దడపా కనిపిస్తూ అలరిస్తున్న మురళీ మోహన్ జీవితంలోని ఒక బ్లాక్ మార్క్ ను గురించి మాట్లాడారు.

డైరెక్టర్ తేజతో నిజం సినిమా సమయంలో గొడవ…
మహేష్ బాబు, డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో మొదట మురళీ మోహన్ గారు చేసారు. కొంత షూటింగ్ అయ్యాక పాత్ర నెగెటివ్ షేడ్ ఉన్నది కావడంతో ఆయన సరిపోవడంలేదనిపించి ప్రకాష్ రాజతో రీప్లేస్ చేసారు. అయితే ఈ విషయం మురళీ మోహన్ గారికి చెప్పకుండా చేయడంతో ఆయన బాధపడ్డారట. అలాగే మొదటి సారి ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారట. ఇక డైరెక్టర్ తేజ క్షమాపణలు చెప్పడం జరిగింది.

ఇక ప్రకాష్ రాజ్ ను కూడా ఒక పాత్రలో ఆల్రెడీ ఒకరు చేస్తూ మధ్యలో వెళ్ళిపోతే కారణాలు తెలుసుకోకుండా నువ్వెలా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నావ్ అని అడిగారట, అయితే నాకసలు విషయం తెలియదని చెప్పారట. ఇక ఆ సినిమాలో కొంతకాలం పనిచేసిన దానికి పారితోషకం ఇవ్వానుకున్నా తీసుకోలేదని ఆ సంఘటన జీవితంలో ఒక బ్లాక్ మార్క్ లాగా నిలిచిపోయిందని చెప్పారు.































