Music Director Koti: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ సంగీత దర్శకులుగా కోటి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన సంగీత సారథ్యంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి ఎన్నో ప్రశంసలు అవార్డులను అందుకున్న కోటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంగీతం అందించాలంటే ఎంత కష్టపడాలో ఆయన వివరించారు. ఇలా ఆ పాట రూపొందడానికి సంగీతదర్శకుల కృషి ఎంతో ఉంటుంది. అయితే ఆ పాట మంచి విజయం అందుకుంటే అది మాత్రం సంగీత దర్శకుల ఖాతాలోకి రాదు. ఆ పాట పాడిన వారికే ఆ క్రెడిట్ దక్కుతుందని కోటి ఈ సందర్భంగా తెలియజేశారు.

అయితే అది పూర్తిగా తప్పు పాట పాడినంత మాత్రాన ఆ పాట క్రెడిట్ మొత్తం సింగర్ ది కాదు.దాని వెనుక ఎంతో కృషి చేసిన సంగీత దర్శకులది దీనిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోటి తెలియజేశారు. ఎంత గొప్ప సింగర్స్ పాడిన ఆ పాటలు ఎప్పటికీ మావే అని ఈయన వెల్లడించారు. ఇక ఈయన సంగీతంలో ఎక్కువగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాటలు పాడారు తనైతే ఎంతో అవలీలగా పాటలు పాడేస్తారు.
ఎవరితోనూ విభేదాలు లేవు…
కొత్తవారికి అవకాశం ఇస్తే మేము ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అప్పట్లో అంత సమయం మాకు ఉండేది కాదని కోటి తెలియజేశారు. ఇక తన సినిమాలలో ఎంతోమంది సింగర్స్ పాటలు పాడారు. అయితే తనకు ఎవరితోనూ ఏ విధమైనటువంటి విభేదాలు లేవని కోటి తెలియజేశారు. ఇక గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాలకు మ్యూజిక్ అందించడం చాలా తేలిక అంటూ కోటి ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
































