తక్కువ ధరకే బంగారం కొనే అవకాశం.. ఎలా అంటే..?

0
144

రోజురోజుకు పసిడి ధర ఆకాశాన్ని తాకుతోంది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 50,000 రూపాయలు ఉండటంతో చాలామంది బంగారం కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అయితే తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని ఫైనాన్స్ కంపెనీలు కల్పిస్తున్నాయి. అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తూ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ముత్తూట్ మిని ఫైనాన్షియర్స్ సంస్థ బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త చెప్పింది.

మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి పసిడి వేలం ప్రారంభం కానుంది. తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయాల్ని ఆసక్తి ఉన్నవాళ్లు వేలంపాటలో పాల్గొని తక్కువ ధరకే బంగారాన్ని పొందవచ్చు. ఎవరైనా బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి డబ్బు తిరిగి చెల్లించకపోతే ఆ ఆభరణాలను ఈ విధంగా విక్రయించడం జరుగుతుంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ వేలం పాట జరగడం లేదు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో జరిగే వేలం పాటల్లో పాల్గొని మాత్రమే బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం సమీపంలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థను సంప్రదించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఉంటే అక్కడ మీకు తెలిసిన వారికి చెప్పి బంగారం కొనుగోలు చేయవచ్చు. వేలంలో పాల్గొనే వారు ముందుగా కొంత డబ్బు డిపాజిట్ చేయడంతో పాటు పాన్ కార్డ్ ఇవ్వాలి.

తెలిసిన వారి ద్వారా మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచిది. తెలియని వారి ద్వారా బంగారం కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here