Keerthi Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే రఘు తాత అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీ విడుదల కానుంది.

ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గతంలో ఈమె పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి కూడా స్పందించి అలాంటిది ఏమైనా ఉంటే తామే చెబుతామని చెప్పారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కు యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు సింగిలేనా ఇలా సింగిల్ గా ఉండటం బోర్ అనిపించలేదా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు కీర్తి సురేష్ సమాధానం చెబుతూ నేను సింగల్ అని ఎప్పుడూ చెప్పలేదే అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
గౌరవం ఇచ్చుకోవడమే..
ఇలా కీర్తి సురేష్ తాను రిలేషన్లో ఉన్నానని చెప్పకనే చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. ఇక పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ పెళ్లి అనేది నా దృష్టిలో ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవించడమే అంటూ పెళ్లి గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు. ఇలా ఈమె ప్రేమ పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























