ఉరుకులు.. పరుగులు జీవితానికి కంటి నిండా నిద్ర కూడా పోని పరిస్థితి. అయితే నిద్ర లేకపోవడంతో ఎంతో మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. సమయం.. సందర్భం లేని ఉద్యోగాలు. వెరసి నిద్రలేమితో బాధపడుతున్నారు చాలామంది. దీని ప్రభావంతో ఆరోగ్యంపై పడుతోంది. అయితే పురాణాల్లో నిద్రించే సమయాల్లో.. కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నాయి.

అవేంటంటే.. ఎవరూ లేని ప్రదేశంలో ఒంటరిగా పడుకోకూడదు. దేవాలయాల్లో, శ్మశాన వాటికలో కూడా నిద్రపోకూడదని మనుస్మృతిలో పేర్కొన్నారు. విష్ణుస్మృతి ప్రకారం నిద్రపోయే వారిని అకస్మాత్తుగా లేపకూడదు. చాణక్య నీతి సూత్రం ప్రకారం ఉద్యోగి, విద్యార్థి అధిక సమయం నిద్రపోతుంటే వారిని లేపొచ్చు. పద్మ పురాణం ప్రకారం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలని సూచిస్తుంది.
పూర్తిగా చీకటి గదిలో కూడా నిద్రించకూడదు. అత్రి స్మృతి ప్రకారం.. తడి పాదాలతో అస్సలు నిద్రించవద్దు. అన్నం తిన్న తర్వాత ఎంగిలి మొహంతో పడుకోవడం మహాభారతం ప్రకారం మంచిది కాదు. నగ్నంగా పడుకోకూడదని ధర్మ సూత్రం సూచిస్తుంది. పగటిపూట సూర్యోదయం, సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి , దరిద్రులు అవుతారని బ్రహ్మా వైవర్తపురాణం పేర్కొంది. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
గుండెపై చేయి వేసుకొని అస్సలు నిద్రించవద్దు. మంచంపై తాగడం, తినడం అస్సలు చేయకూడదు. పడుకొని పుస్తకం తీసి అస్సలు చదవకూడదు. నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం అశుభం కావున పడుకొనే ముందు తీసేయాలి. ఇలా పైన చెప్పిన విధంగా నిద్ర ఎలా పోవాలనే నియమాలు పాటిస్తే.. ఆరోగ్యవంతుడు, దీర్ఘాయుష్మంతుడని చెబుతుంటారు.































