Nag Ashwin: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇకపోతే ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ సినిమా ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కబోతుందని ఈ సినిమా అచ్చం శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాని పోలి ఉంటుందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఒకే ఒక జీవితం ప్రాజెక్టుకే రెండు ఒకే కథంశమని అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నాగ్ అశ్విన్ స్పందించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… ఒకే ఒక జీవితం ప్రాజెక్టుకే సినిమాకు ఏ మాత్రం పోలిక లేదని టైం ట్రావెల్ కథాంశం అయినంత మాత్రాన అన్ని సినిమాలు ఒకేలా ఉండవ్ అంటూ ఈయన పరోక్షంగా మండిపడ్డారు.

Nag Ashwin: ఆ వార్తలన్నీ ఆవాస్తవమే…
ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఈయన స్పందిస్తూ ప్యారడైస్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరు అంటూ కామెంట్ చేశారు. ప్రాజెక్టుకే సినిమాల్లో ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా ఎనిమిది నెలల సమయం కేటాయిస్తున్నాము అంటూ ఈ సినిమా గురించి వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమే అంటూ ఈ రూమర్లను ఖండించారు.































