Kalki 2: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలో కూడా కల్కి సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయం సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా విజయం కావడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించిన వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలు గురించి సరిగా క్లారిటీ లేదు ఆయన ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ క్రమంలోనే కృష్ణుడి పాత్రలో నటించినది ఎవరు అనే విషయంపై ఎన్నో సందేహాలు వచ్చాయి. ఇక కల్కి 2 లో కూడా కృష్ణుడికి సంబంధించిన పాత్ర చాలానే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రిపోర్టర్స్ కృష్ణుడికి సంబంధించిన పాత్ర గురించి ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో మహేష్ బాబుని కృష్ణుడిగా చూపిస్తే బాగుంటుందని అంటున్నారు.
వేరే సినిమాలలో బాగుంటుంది..
ఈ సినిమాలో మహేష్ బాబుని కృష్ణుడిగా చూసే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ బాగుంటుంది అయితే ఈ సినిమాలో కాకుండా ఇతర సినిమాలలో అయితే బాగా సెట్ అవుతుంది అంటూ సమాధానం చెప్పకు వచ్చారు. దీన్నిబట్టి చూస్తుంటే కల్కిలో మహేష్ బాబు ఉండరని స్పష్టంగా అర్థం అవుతుంది.



























