Nagababu: సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మెగా కుటుంబం నుంచి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవి తన తమ్ముళ్ళకి కూడా ఎంతో మార్గదర్శకంగా మారారు.

ఇలా వీరందరూ ఎంతో వయసు వచ్చినప్పటికీ కూడా వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమ అనుబంధాలను వ్యక్తం చేస్తూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు.ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మెగా కుటుంబ సభ్యులు ఎంతగా తనకు సపోర్ట్ చేశారో మనకు తెలిసిందే.
ఇక పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో ఆ విజయాన్ని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగలాగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగబాబు తమ మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి వెల్లడించారు.
మేం ఈ వయసుకి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా మా మధ్య గొడవలు లేకుండా ఎంతో ప్రేమను రాగాలతో ఉన్నాము అయితే మా మధ్య ఇలాంటి ప్రేమ అనుబంధాలు రావడానికి కారణం అమ్మేనని తెలిపారు. అమ్మ ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు కలిసి ఉండాలని గొడవలు పడకూడదని కోరుకుంటారు..
కలిసి ఉండాలన్నదే అమ్మ కోరిక..
అమ్మ అన్నయ్య వద్దే ఉంటుంది కనుక అన్నయ్య తరచూ తనని కలుస్తూ ఉంటాడు. నేను ఒక 15 రోజులకు ఒకసారి వెళ్లి ఒక రోజంతా అమ్మ దగ్గర గడిపి కబుర్లు చెబుతాను ఒకవేళ వస్తే ఒకరోజు మొత్తం అమ్మతోనే గడుపుతారు.మేం ఐదుగురం ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ తోడుగా ఉండాలన్నదే అమ్మ కోరిక అంటూ మెగా అనుబంధం గురించి నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























