Allu Arjun: ఇటీవల సోషల్ మీడియాలో నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ అనే విధంగా మారిన సంగతి మనకు తెలిసిందే. అల్లు అర్జున్ తన స్నేహితుడు అయినటువంటి వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలుపుతూ నంద్యాల వెళ్లడంతో మెగా అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ అల్లు అర్జున్ అభిమానులను బాగా హార్ట్ చేసింది.

పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు మెగా హీరోల మద్దతు లభించింది. అయితే అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు తన మద్దతు తెలియజేశారు. ఇక తన స్నేహితుడు కావడంతో శిల్ప కోసం నంద్యాల వెళ్లారు. అయితే నాగబాబు మాత్రం అల్లు అర్జున్ ని ఉద్దేశించి ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే అంటూ ఒక పోస్ట్ చేశారు.
ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి చేశారా అనేది స్పష్టంగా చెప్పకపోయినా ఖచ్చితంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారని మాత్రం తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు. అయితే ఈ ట్రోల్స్ దెబ్బకి ఏకంగా నాగబాబు ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేశారు.
బన్నీ ఆర్మీ ఎఫెక్ట్..
ఇలా అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన హీరోని ఇంతలా అవమానించినందుకు నాగబాబు పై భారీ స్థాయిలో విమర్శలు చేశారు. ఇలా విమర్శలు వస్తున్నటువంటి తరుణంలోనే నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేయడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.



























