Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు సాధారణంగా నాగచైతన్య తన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ తప్ప మిగతా సమయాలలో ఎక్కడ బయట కనిపించరు.ఈయనకు ఎక్కువగా అందరితో కలవడం మాట్లాడడం ఇష్టం ఉండదని ఎన్నో సందర్భాలలో తెలిపారు. అయితే థాంక్యూ సినిమా తనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో నాగచైతన్య వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈయన నటించిన థ్యాంక్యూ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షో తోనే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి ఓ మ్యూజికల్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ క్రమంలోనే నాగచైతన్య ఒక్కసారిగా వేదికపై డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

సాధారణంగా హీరోలు సినిమాలలో డాన్స్ చేయడం సర్వసాధారణం అయితే బయట ఇలాంటి కార్యక్రమాలలో డాన్స్ చేయడానికి కాస్త మొహమాట పడతారు. అయితే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మహేష్ బాబు వేదికపై డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే నాగచైతన్య సైతం ఈ స్టూడెంట్ మీట్ కార్యక్రమంలో భాగంగా వేదికపై డాన్స్ చేశారు.
మొదటిసారి వేదికపై డాన్స్ చేసిన చైతు..
వేదికపై విద్యార్థులందరూ డాన్స్ చేస్తున్న సమయంలో ఓ విద్యార్థిని స్టేజి నాగచైతన్య చేయి పట్టుకుని తనను వేదిక పైకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే విద్యార్థులతో కలిసినాక చైతన్య డాన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం నాగచైతన్య ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సైతం డాన్స్ చేసినట్లు తెలుస్తోంది.































