టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కుటుంబ, వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ చాలా ప్రైవేటుగా ఉంచుకుంటాడు మరియు తన పిల్లలలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా మీడియా దృష్టికి దూరంగా ఉండేలా చూస్తాడు.. ఇక వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితా దగ్గుబాటి వివాహం 2019 వ సంవత్సరంలో జరిగిన సంగతి తెలిసిందే..హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆశ్రిత.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించి ఆశ్రిత పెళ్లిని దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఘనంగా జరిపించారు..ఇక పెళ్లి తర్వాత ఈ జంట స్పెయిన్ కి వెళ్లిపోయారు..

ఇక ప్రస్తుతం ఈమె తన భర్తతో కలిసి బార్సిలోనా లో ఉంటుంది..గత కొన్ని నెలలుగా యూరప్‌లో సందర్శిస్తున్న అన్ని ప్రదేశాల గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు పోస్టులను పోస్ట్ చేస్తూ వస్తోన్న ఆశ్రిత.. ఇప్పుడు, ఆమె తన స్వంత యూట్యూబ్ ఛానెల్ – ఇన్ఫినిటీ ప్లాటర్ – ను ప్రారంభించింది, అక్కడ ఆమె ఆహారం, అన్యదేశ ప్రదేశాలు మరియు ఇతర విషయాలతో పాటు తన అనుభవాలను డాక్యుమెంట్ చేయబోతోంది..ప్రతి రోజు రుచికరమైన వంటకాలను చేస్తూ.. తన ఛానల్ ద్వారా పంచుకుంటోంది..ఇక ఆమె వంటకాలతో చేసిన ప్రయోగాలు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకునే అధిక-నాణ్యత గల ఫుడ్ ఫోటోగ్రఫీ కూడా ఆమె కొత్త యూట్యూబ్ ఛానెల్‌లో ప్రశంసలు పొందుతుంది..

ఇక ఆశ్రిత ను సపోర్ట్ చేస్తూ.. తన కజిన్ అయినా అక్కినేని నాగచైతన్య తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.. ఆ పోస్ట్ లో భాగంగా పేర్కొంటూ..”wishing my super talented cousin all the best for infinity platter..So happy your going this ash…”అంటూ పోస్ట్ చేసాడు.. ప్రస్తుతం చైతూ చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here