సమంతను కాకుండా నాగచైతన్య హీరోయిన్ శృతి హాసన్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడా?

0
334

సమంత, నాగచైతన్య మొదటి పరిచయం.. తర్వాత ప్రేమ, అన్నీ ‘ఏమాయ చేసావే’ సినిమాతోనే అయ్యాయి. ఆ సినిమా తర్వాతనే నాగచైతన్య, సమంత ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అనుకోని చిన్న చిన్న కారణాల కారణంగా ఇద్దరు విడిపోయారు.

ఈ నిర్ణయం ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురి చేసింది. విడాకుల ప్రకటన తర్వాత వాళ్ల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. వాళ్లు విడిపోవడానికి గల కారణం మాత్రం ఇంత వరకు అధికారికంగా మాత్రం బయటకు చెప్పలేదు.

సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోకపోవడంతోనే నాగచైతన్య విడాకులు ఇచ్చారని.. ఆమె భవిష్యత్తుకు అక్కినేని ఫ్యామిలీ అడ్డు పడుతున్నారన్న కారణంతోనే సమంత విడాకులు ఇచ్చారని ఏవేవో వినిపిస్తున్నాయి. ఇక విడాకుల తర్వాత సమంత తన కెరీర్ విషయంలో ఆలోచించి అడుగులు వేస్తున్నారు. చేతినిండా సినిమాలు.. ఏ మాత్రం రెస్ట్ లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.

అంతేకాకుండా ఇన్ స్టాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేసుకుంటూ.. అభిమానులకు పంచుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. సమంతను పెళ్లి చేసుకోవడానికి ముందు నాగచైతన్య కమల్ హాసన్ కూతురు శృతి హాసన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. అంతే కాకుండా ప్రేమమ్ సినిమాలో ఇద్దరు కలిసి జోడీగా కూడా నటించారు. 2013 లో వీళ్లిద్దరు డేట్ లో ఉన్నట్లు సమాచారం. వీళ్లిద్దరు ప్రేమించుకున్నా.. పెళ్లి వరకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తలియదు కానీ.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here