Nagachaitanya -Sobhita: సినీ నటి శోభిత నాగ చైతన్యల వివాహం త్వరలోనే జరగబోతున్న సంగతి తెలిసిందే .డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది. అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇక తాజాగా నాగచైతన్య శోభిత హల్ది వేడుకలు కూడా ఎంత ఘనంగా జరిగాయని తెలుస్తుంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక శోభిత నాగచైతన్య గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియజేయడంతో పెద్దలు కూడా వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగచైతన్య శోభిత కుటుంబం గురించి ఎంతో గొప్పగా చెప్పారు కుటుంబ ఆలోచనలు మా కుటుంబ ఆలోచనలు చాలు దగ్గరగా ఉన్నాయని వారి కుటుంబంతో కలిసి ప్రయాణించడం నాకు చాలా సౌకర్యంగా ఉందని తెలిపారు.
ఇక శోభిత కుటుంబ సభ్యులు నన్ను ఒక కొడుకు లాగా భావిస్తున్నారు అంటు నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక శోభిత కుటుంబ సభ్యులు కూడా పెళ్లి విషయంలో ఒకే విషయం మమ్మల్ని కోరారు అంటూ నాగార్జున తెలిపారు. వీరి వివాహాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించాలని చెప్పినట్లు ఇటీవల నాగార్జున ఓ సందర్భంలో తెలిపారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయంలోని వీరి పెళ్లి జరగబోతుంది.

Nagachaitanya -Sobhita: పట్టు పంచే, చీర..
ఇదిలా ఉండగా నాగచైతన్య శోభిత పెళ్లి వేడుకలలో భాగంగా పెళ్లికి వచ్చిన అతిథిలకు ఇచ్చే రిటన్ గిఫ్ట్స్ ఎంతో అద్భుతంగా భిన్నంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. సుమారు 300 మంది వరకు ఈ పెళ్లికి హాజరు కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. అయితే వచ్చిన వారందరికీ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా పట్టు పంచ పట్టుచీరను రిటన్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.



























