Nagachaitanya -Sobhita: సినీ నటుడు నాగచైతన్య శోభిత త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో జరగబోతోంది. ఇప్పటికి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా సమంత విడాకులు తీసుకున్న తర్వాత శోభిత మెడలో నాగచైతన్య మూడు ముళ్ళు వేయబోతున్నారు.

ఇక వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ పెళ్లి తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరి ప్రేమకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత ప్రేమ విషయాన్ని ముందుగా ఎవరు బయటపెట్టారు. అసలు ఎవరు ఎవరికి ముందు ప్రపోజ్ చేశారు అనే విషయానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నాగచైతన్య ముందుగా శోభితకు తన ప్రేమ విషయాన్ని తెలియజేశారట. శోభితతో స్నేహంగా ఉన్న సమయంలోనే ఓ సందర్భంలో నాగచైతన్య ఆమెతో మాట్లాడుతూ నీలాంటి అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుండు తిరిగి నా లైఫ్ లో హ్యాపీడేస్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారట. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావాలని ఆమెకు తెలియజేస్తూ ప్రపోజ్ చేశారని తెలుస్తుంది.

Nagachaitanya -Sobhita:చైతన్య..
ఇలా నాగచైతన్య ప్రపోజ్ చేసిన వెంటనే శోభిత తన ప్రేమను ఏమాత్రం అంగీకరించలేదట తనకు కొంచెం సమయం కావాలని సమయం తీసుకున్న శోభిత నాగచైతన్యను కనుక పెళ్లి చేసుకుంటే సోషల్ మీడియాలో తన గురించి వచ్చే నెగిటివిటీ ఎలా ఎదుర్కోవాలి.. అది నా కెరియర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాల గురించి బాగా ఆలోచించి నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక నాగచైతన్య తనకు పర్ఫెక్ట్ జోడి అని భావించిన శోభిత ఈ విషయం పెద్దలకు చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.




























