నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ స్టోరీ ఇదేనా.. చాలా డిఫరెంట్ గా ఉందే..!!

0
95

టాలీవుడ్ లో ఇటీవల మజిలీ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు నాగచైతన్య.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ సరసన సమంత హీరోయిన్ గా నటించగా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..ఇక ప్రస్తుతం క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోర్ సినిమా షూటింగ్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది..

ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు చైతన్య.

ఇక ‘థాంక్యూ’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ప్రకారం ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు.

ఇండియాలో తన కుటుంబ సభ్యులను వెదికేందుకు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న అనుభవాల సారాంశమే ఈ సినిమా అంటున్నారు. విక్రమ్ కుమార్ కథలు అన్ని కూడా చాలా విభిన్నంగా స్క్రీన్ ప్లే బేస్డ్ గా సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందని అంటున్నారు. ఇక ‘థాంక్యూ’ సినిమాను శరవేగంగా షూట్ చేస్తున్నాడు విక్రమ్.ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం సిద్ధం అవుతోంది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here