Naga Chaitanya: నాగచైతన్య తాజాగా థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ అందుకోవడంతో నాగచైతన్య ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం లాల్ సింగ్ చద్దా సినిమాపై పెట్టారు.బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానంది.

ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు అనే పాత్రలో అమీర్ ఖాన్ స్నేహితుడిగా సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో నాగచైతన్య పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య టాలీవుడ్, బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియాతో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు తరచూ తన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలోనే నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదంటూ అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈయన సమంత గురించి మాట్లాడుతూ తనంటే తనకు ఎంతో గౌరవమని తనపై ఎప్పటికీ ఆ గౌరవం ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Naga Chaitanya: నాగచైతన్య యవ్వారం తేడాగా ఉందే…
నాగచైతన్య సమంత గురించి ఇలా మాట్లాడటంతో తనకు మరొక ప్రశ్న ఎదురయింది. జీవితంలో తిరిగి ప్రేమలో పడటం లాంటివి ఉంటాయా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ ప్రేమ జీవితంలో ఎంతో ముఖ్యమైనది.మనం బ్రతకడానికి గాలి ఎలా పీల్చుకుంటామో మన జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్యమని ఆ ప్రేమ మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జీవితంలో ముందుకు నడిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా నాగచైతన్య ప్రేమ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పలువురు నెటిజెన్లు స్పందిస్తూ నాగచైతన్య వ్యవహారం ఏదో తేడా కొడుతుంది అంటూ మరోసారి శోభిత మ్యాటర్ తెరపైకి తీసుకువస్తున్నారు.
































