Naga Shaurya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి నాగశౌర్య తాజాగా రోడ్డుపై రియల్ హీరోగా మారిపోయాడు. రోడ్డుపై ఒక యువకుడితో నాగశౌర్య గొడవ పడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి నేటిజన్స్ నాగశౌర్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే రోడ్డుపై లవర్స్ ఇద్దరూ నడుచుకుంటూ వెళుతుండగా అబ్బాయి ఉన్నఫలంగా అమ్మాయిపై చేయి చేసుకున్నారు. ఇది గమనించినటువంటి నాగశౌర్య ఒక్కసారిగా కారు దిగి ఆ అబ్బాయితో గొడవపడ్డారు.ఇలా నడిరోడ్డుపై అమ్మాయిని కొట్టడం ఏంటి ముందు తనకు క్షమాపణలు చెప్పు అంటూ నాగశౌర్య ఆ అబ్బాయితో గొడవకు దిగారు.
ఇలా నాగశౌర్య గొడవ పడటంతో పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ అబ్బాయి ఆ అమ్మాయి తన లవర్ అని తన లవర్ తన ఇష్టం అంటూ మాట్లాడారు.అమ్మాయి నీ లవర్ అయినా నడిరోడ్డుపై ఇలా అమ్మాయిపై చేయి చేసుకోవడం తప్పు ముందు తనకు క్షమాపణలు చెప్పు అంటూ ఈయన ఆ అబ్బాయి ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పే వరకు వదలలేదు.

Naga Shaurya: రియల్ హీరో అనిపించుకున్న నాగశౌర్య..
ఈ విధంగా నాగశౌర్య అమ్మాయికి క్షమాపణలు చెప్పించడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పైస్పందించిన నేటిజన్స్ నాగశౌర్య నిజమైన హీరో అనిపించుకున్నారని అతను చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మరి కొందరు మాత్రం వాడి లవర్ ను వాడు కొట్టుకుంటే మీకేంటి అభ్యంతరం అంటూ విమర్శలు చేస్తున్నారు.
#nagashaurya reel lone kadu real life lo kuda hero anipinchukunaru sir ???????????? pic.twitter.com/R3J8sObOq6
— ks Raju (@ksRaju58119364) February 28, 2023
































