Nagaarjuna : అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి నాగార్జున తన నటనతో, లుక్స్ తో టాప్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. తన కొడుకులు హీరోలుగా సినిమాలు చేస్తున్నా ఇప్పటికీ అదే క్రేజ్ తో వారికి కూడా పోటీ ఇస్తున్నాడు. నాగార్జున మొదట దగ్గుబాటి వారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తరువాత నాగ చైతన్య పుట్టాక కొన్ని కారణాలతో వారు విడిపోయి, తరువాత అమల ను ప్రేమించి పెళ్లి చరసుకోవడం తెలిసిందే.

అమలకి ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఆ పని చేస్తూ…
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ అన్యోన్యంగా కలసి ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉన్నారు. అమల అంటే నాగార్జునకు చాలా ఇష్టమని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే అమల పెళ్లి అయిన కొత్తలో నాగార్జునతో ఒక మాట తీసుకుందట, ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే అని వాగ్దానం చేయించుకుందట. ఆ పనిని నాగార్జున ఇప్పటికీ చేస్తున్నారంట.

ఇంతకీ ఆ పని ఏంటంటే.. అమలకు జంతువులు అంటే చాలా ఇష్టమని తెలిసిందే, వాటికి ఏదైనా హాని జరిగితే అసలు తట్టుకోలేదు. అందుకే పెళ్లి అయిన మొదట్లో నేను సంపాదించే దాంట్లో కొంత భాగం జంతు సంరక్షణకు కేటాయిస్తాను అని, మీరు కూడా కొంత భాగం వాటి కోసం ఖర్చు చేయమని అడిగిందట. అందుకు నాగార్జున ప్రతి సంవత్సరం తాను సంపాదించే మొత్తంలో కొంత వాటికోసం ఇస్తున్నాడట. అయితే ఇప్పటికీ అమలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ పని చేస్తున్నాడు. ఇది ఒకటి చాలు భార్య మీద నాగార్జునకు ఎంత ప్రేమ ఉందో తెలియడానికి.































