Susmitha : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు చిరంజీవి ఎక్కువగా వివాదాలకు వెళ్లరు కాని తన తమ్ముళ్లు మాత్రమే మెగా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే వారి తాటతీస్తూ ఉంటారు. ఇక చిరంజీవి ఫ్యామిలీ విషయానికి వస్తే ఈయనకు ముగ్గురు సంతానం మొదట సుస్మిత కాగా తర్వాత రామ్ చరణ్ శ్రీజ సంతానం అయ్యారు.

ఇక సుస్మిత ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. రాంచరణ్ తండ్రినీ మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక శ్రీజ సినిమా రంగంలో లేకపోయిన ఇతర వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈమె వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇక సుస్మిత గురించి తాజాగా పరువు వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా నాగబాబు చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సుస్మిత మా ఇంట్లో అందరిని కూడా క్రమశిక్షణలో పెట్టారు. నాన్న అంటే మేమంతా భయపడే వాళ్ళం. కానీ సుస్మితకు మా నాన్న భయపడేవారు .
ఆమె ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా స్టిక్ గా ఉంటుంది. కొన్ని విషయాలలో మమ్మల్ని కూడా బాగా తిడుతుందని నాగబాబు తెలిపారు.. ఇక తన ఇద్దరు పిల్లలని చాలా క్రమశిక్షణతో పెంచుతుందని తన ఇంట్లో మిలిటరీ రూల్స్ ఉంటాయని కచ్చితంగా వాటిని పాటించాలని నాగబాబు తెలిపారు.
క్రమశిక్షణ..
మేము కూడా మా పిల్లలను అంత క్రమశిక్షణగా పెంచలేదు కానీ సుస్మిత మాత్రం చాలా క్రమశిక్షణతో పెంచుతుందని తెలిపారు. ఆమె కనుక ఐపిఎస్ అయ్యి ఉంటే అందరి తాటా తీసేదని నాగబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























