Nagababu: సినీ నటుడు నాగబాబు గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ ను తమ ఫ్యామిలీకి దూరం పెడుతూ వచ్చారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా తన స్నేహితుడు వైకాపా నాయకుడికి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్లారు. ఆ క్షణం నుంచి మెగా కుటుంబ సభ్యులు అలాగే మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ దూరం పెట్టడమే కాకుండా ఆయనపై తరచూ విమర్శలు చేయడం, ఆయన సినిమా పట్ల నెగిటివ్ ప్రచారం చేయడం జరిగింది.

ఇక నాగబాబు కూడా పరోక్షంగా అల్లు అర్జున్ గురించి పోస్టులు చేశారు. శత్రువుకు పని చేసేవాడు మా వాడు అయిన పరాయి వాడే అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఈ సినిమా విడుదల అవుతుందన్న తరుణంలో ఇప్పటికైనా తప్పు తెలుసుకుని నీ మూలాలను చేరుకో లేకపోతే నీ మూలాలను చేరుకోవడం కష్టమవుతుంది అంటూ అల్లు అర్జున్ గురించి పోస్టులు చేశారు.
ఇక ఈ సినిమా విడుదలకు కొన్ని క్షణాల ముందు నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.వందలాది టెక్నీషియన్లు, 24 క్రాఫ్ట్స్ కలిసి పని చేసి వేలాది మందికి ఉపాధి కలిగిచే సినిమాను విజయవంతం చేయాల్సిన బాధ్యత సినీ ప్రియులు, అభిమానుల మీద ఉందని ఎక్స్ వేదికగా ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే ఈ వారంలో పుష్ప సినిమా తప్ప మిగతా ఏ సినిమాలు విడుదల కాలేదు.

Nagababu: పుష్ప సినిమా గురించేనా…
ఇలాంటి సమయంలో ఈయన ఈ పోస్ట్ చేయడంతో తప్పనిసరిగా పుష్ప సినిమాని ఉద్దేశించే చేశారని తెలుస్తుంది. ఎక్కడ కూడా పుష్ప సినిమా మేకర్స్ పేర్లను కానీ దర్శకుడు అల్లు అర్జున్ పేరును కూడా ఈయన ప్రస్తావించకుండా సినిమా చూడాలని చెప్పడంతో ఈ సినిమా విషయంలో ఈయన తీసుకున్న ఈ నిర్ణయం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.































