Nagababu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా సేల్ అవ్వడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది.

ఇలా పుష్ప సినిమా విడుదలకు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇద్దరి అభిమానుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధానికి కారణమైందని చెప్పాలి. గత కొంతకాలంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
ఈ పోస్టులో ఈయన వివేకానంద చెప్పిన కొన్ని మాటలకు సంబంధించిన కొటేషన్ షేర్ చేశారు. నువ్వు తప్పు మార్గాన్ని ఎంచుకున్నావు అయినా పరవాలేదు వెంటనే ఆ తప్పు సరిదిద్దుకొని వెనక్కి వచ్చేసేయ్ లేదంటే తిరిగి నీ మూలాలను కలుసుకోవడానికి ఎంతో కష్టమవుతుందని వివేకానంద చెప్పిన కొటేషన్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు .

Nagababu: మూలాలను చేరుకోలేవు..
ఇక నాగబాబు కచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మూలాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయనేది ముందు నాగబాబు గ్రహించాలి అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది అల్లు అర్జున్ ని విమర్శిస్తూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నాగబాబు చేసిన ఈ పోస్ట్ ఇద్దరి అభిమానుల మధ్య చిచ్చురేపిందని చెప్పాలి.































