Nagababu: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతము వైరల్ అవుతుంది. ఇటీవల ఈవీఎం ధ్వంసం చేస్తున్న కేసులో పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన రిమాండ్ లో ఉన్నారు.

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైయస్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అయ్యారు. ఈ విధంగా పిల్లలతో మూలాఖత్ అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ.. ఏం మాట్లాడుతున్నారండి బాబు పోలింగ్ కేంద్రంలో నిజంగా అన్యాయం జరిగితే అక్కడ పోలీసులు ఉన్నారు. ఎన్నికల సిబ్బంది కూడా ఉన్నారు. ఇలా మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఎచ్చులకు పోయి 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఇకనైనా పరిణితితో మాట్లాడకపోతే సింగిల్ డిజిట్ కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ ఈయన జగన్మోహన్ రెడ్డి పై చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
సింగిల్ డిజిట్..
ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి నాగబాబు చేసిన ఈ ట్వీట్ గురించి స్పందించడం వైసీపీ అభిమానులు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలో మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి అంటూ వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























