Nagababu: సినీ నటుడు నాగబాబు తాజాగా తన కుమార్తె నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిహారిక కుటుంబ సభ్యులతో పాటు హీరో సాయిధరమ్ తేజ్ అడివి శేష్ వంటి వారు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఇటీవల కాలంలో కొంతమంది మెగా ఫ్యామిలీ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే వారికి నాగబాబు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ చాలామంది మెగా ఫ్యామిలీ పై పడి ఏడుస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం మా తాత సొత్తు మా అబ్బ సొత్తు కాదు ఇక్కడ ఎవరికీ టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు…
ఎంతోమంది ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే సక్సెస్ అయిన వారు ఉన్నారు. ఇండస్ట్రీ అంటే మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం కాదు. ఎవరికి టాలెంట్ ఉంటే వారు సక్సెస్ అవుతారు. కొంతమంది ఎదవలు మా ఫ్యామిలీ పై పడి ఏడుస్తూ ఉంటారు అలాంటి వారికే నేను చెబుతున్న.

టాలెంట్ ఉంటే సక్సెస్..
ఇంకొక్కసారి మెగా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం సహించనని ఒక్కొక్కరికి తాటతీస్తా అంటూ ఈ సందర్భంగా నాగబాబు తనదైన శైలిలో ఫైర్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలోకి అమ్మాయిలు కూడా రావాలని హీరోయిన్లుగా కాకపోయినా టెక్నికల్ రంగంలో వారు ఉన్నతంగా ఎదగాలని ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అంటూ ఈయన కామెంట్లు చేశారు.



























