Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే నటుడిగా నిర్మాతగా నాగబాబు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక మెగా ఫ్యామిలీలో కేవలం వారసులు మాత్రమే కాకుండా వారసురాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఇప్పటికే మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగి అనంతరం నిర్మాతగా మారారు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత సైతం నిర్మాతగా మారిపోయారు. సుస్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకు మాత్రం ఇప్పటివరకు ఏ హీరో ఛాన్స్ ఇవ్వలేదని నాకు మెగా ఫ్యామిలీలో మొదటగా ఛాన్స్ ఇచ్చినది మా సుస్మిత మాత్రమేనని తెలిపారు. ఈమె ఇది నాకు మొదటి అవకాశం కాదు ఇదివరకు ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశాన్ని కూడా కల్పించారని తెలిపారు..

Nagababu: ఏ హీరో సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుస్మిత…
ఇకపోతే మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ సుస్మిత మాత్రం ఎవరి సపోర్ట్ లేకుండా ఒక కొత్త నిర్మాత ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం కోసం ఎలా అయితే కష్టపడతారో తాను కూడా అలా కష్టపడుతోందని, త్వరలోనే సుస్మిత కూడా మెగా ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకుంటుందని నాగబాబు తెలిపారు.ఇలా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడుతూ ఏ సపోర్ట్ లేకుండా ఎదుగుదల కోసం శ్రమిస్తున్న సుస్మితను చూస్తుంటే తనకు చాలా గర్వకారణంగా ఉందని నాగబాబు వెల్లడించారు.ఇలా ఈ వేడుకలో భాగంగా మెగా హీరోల గురించి తనకు అవకాశాలు ఇవ్వకపోవడం గురించి నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































