Nagababu: గత రెండు రోజులుగా మెగా వెర్సెస్ వైసీపీ అన్నట్టు సోషల్ మీడియాలోనూ మీడియా వార్తలులోను పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది.చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వైసీపీని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ముందు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రత్యేక హోదా తీసుకురావాలి అంటూ వైసిపి నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ విధంగా చిరంజీవి వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో వైసిపి నేతలు ఒక్కొక్కరు రంగంలోకి దిగుతూ చిరంజీవి పై అలాగే మెగా కుటుంబం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.తరుణంలో మెగా ఫాన్స్ అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందిస్తూ వైసిపి నేతలకు గట్టిగా బుద్ధి చెప్పారు.
ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… శ్రమను పెట్టుబడిగా పెట్టి పన్ను అనా పైసతో సహా చెల్లించి…వినోదాన్ని విజ్ఞానాన్ని జనాలకు పంచిపెట్టే 24 క్రాఫ్ట్ లకు కడుపునిండా భోజనం పెట్టే ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ. ఏ పని పాట లేనోడు పిల్లి తల కొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తుల మీద విషం కక్కుతున్నారు.ప్రస్తుతం ఆయన గురించి విమర్శలు చేస్తున్నటువంటి ఆంధ్ర మంత్రులు ఒకానొక సమయంలో ఆ అన్నయ్యతో ఫోటో దిగడం కోసం పడిగాపులు కాచిన వారేనంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

Nagababu: కాలం గాలం ఏస్తే ప్రకృతి కూడా శత్రువే…
మీ బతుకు శాఖలపై అవగాహన లేదు… అభివృద్ధి అంటే ఏంటో అర్థం తెలియదు కేవలం బటన్ నొక్కి పథకాలు అందిస్తేనే అభివృద్ధి కాదు…మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటేనే అర్థమవుతుంది. మీ దౌర్భాగ్యపు ధర్మాలను పాలనకు ఎండ్ కార్డు పడే రోజులు దగ్గర పడుతున్నాయి…కాలం గాలం ఏస్తే ప్రకృతి కూడా శత్రువే అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
శ్రమని పెట్టుబడిగా పెట్టి,
పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి,
వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి ,
24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ..ఏ పని లేనోడు పిళ్లి తల గొరిగినట్టు
నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు,ఆయన…— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2023