Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య మొదటిసారి తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే సమంతతో తనకు జరిగిన గొడవ గురించి తను ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాల గురించి కూడా తెలియజేశారు.. అయితే తాజాగా సమంత గురించి మరోసారి నాగచైతన్య మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.
సమంతకు నాకు రెండు సంవత్సరాల క్రితమే చట్టపరంగా విడాకులు వచ్చాయి. అయినప్పటికీ మా విడాకుల వార్తలు గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇప్పటికైనా ఈ విడాకుల వార్తలు ఆగుతాయని అనుకుంటున్నాను అంటూ చైతన్య తెలియజేశారు. ఇక సమంత ఎంతో మంచి అమ్మాయని తన జీవితంలో సమంతతో గడిపిన ఆ రోజులంటే తనకు ఎంతో గౌరవమని నాగచైతన్య తెలిపారు.

Nagachaitanya: సినిమా సక్సెస్ కోసమేనా…
ఇలా నాగచైతన్య సమంత గురించి పెద్ద ఎత్తున కామెంట్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే పలువురు నాగచైతన్య వ్యాఖ్యలపై స్పందిస్తూ నిజంగానే నాగచైతన్యకు సమంత అంటే అంత ప్రేమ ఉందా లేక తన సినిమాని సక్సెస్ చేసుకోవడం కోసం సమంత పేరును ఉపయోగిస్తున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా నాగచైతన్య సమంత గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.