టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంత ప్రేమించుకుని ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి కూడా తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తరువాత ఎక్కడా కూడా విడిపోయామన్న సంగతి చెప్పలేదు.

ఇటీవల సమంత విడాకుల వ్యవహారం గురించి మాట్లాడగా దాని గురించి ఇకపై మాట్లాడనని.. మాట్లాడటం కూడా అనవసరం అని చెప్పుకొచ్చింది. నాగ చైతన్య విడాకులు తీసుకున్న తరువాత ఆ విషయం గురించి ఇన్ డైరెక్టుగా కానీ డైరెక్ట్ గా కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

నాగచైతన్య వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సమంత మాత్రం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏవో రకాల కొటేషన్లు పెడుతూనే ఉంది. విడాకుల తర్వాత నుంచి సమంత నాగ చైతన్య కు సంబంధించి ఏదో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Nee clarity @chay_akkineni ???????? pic.twitter.com/LAXv1T6AMz
— RishiQ (@risheek_king) December 10, 2021
ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను ఎలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపరు? అని ప్రశ్నించగా.. ఆ విషయంపై చైతన్య స్పందిస్తూ.. నేను అన్ని తరహా పాత్రలను చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. అయితే నేను చేసే సినిమా కానీ, అందులోని పాత్ర కానీ నా కుటుంబానికి ఇబ్బంది కలగకూడదు.. ఆ పాత్ర నా కుటుంబం పై ప్రభావం చూపితే మాత్రం చేయనని చెప్పేస్తాను అని తెలిపారు చైతన్య. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నాగచైతన్య ఇలా సమాధానం చెప్పడంతో కొంతమంది నేతలు నాగ చైతన్య ఇండైరెక్ట్ గా సమంతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే బంగార్రాజు, థాంక్యూ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

































