Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య హీరోగా మంచి గుర్తింపు పొందాడు. హీరోయిన్ సమంత వివాహం చేసుకొని పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో ఆనందంగా ఉండేవాడు. అయితే కొంతకాలం క్రితం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల సమంత, నాగచైతన్య ఇద్దరు విడిపోయారు.

ఇలా వీరు విడిపోయిన తర్వాత నాగచైతన్య గురించి అనేక రూమర్లు వినిపించాయి. నాగచైతన్య యంగ్ హీరోయిన్ ప్రేమలో ఉండటం వల్ల సమంతకు విడాకులు ఇచ్చాడని కొంతకాలం వార్తలు వినిపించాయి. ఆ తర్వాత హీరోయిన్ శోభిత దూళిపాలితో డేటింగ్ లో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత మజిలీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌషిక్ తో చైతన్య ప్రేమలో పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హీరోయిన్గా నాగచైతన్య దివ్యాంశ కౌశిక్ ని ప్రిఫర్ చేసినట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి.
మజిలీ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన దివ్యాంశ కౌశిక్ ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నాగచైతన్యతో రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ నాగచైతన్యతో తన రిలేషన్ గురించి వివరించింది.

Nagachaitanya: నాగచైతన్య అంటే లవ్….
ఈ ఇంటర్వ్యూలో దివ్యాంశ మాట్లాడుతూ” నాగచైతన్య చూడటానికి చాలా బాగుంటాడు. అతని మీద నాకు క్రష్ ఉంది. ఐ లవ్ నాగచైతన్య. కానీ అందరూ అనుకుంటున్నట్లు మా మధ్య ఎలాంటి ప్రేమ లేదు. మా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు. అంతేకాకుండా రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం హీరోయిన్ గా నన్ను రిఫర్ చేసినట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇకనుండి అయినా నాగచైతన్య దివ్యాంశ పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి.