Nagachaitanya -Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో నాగచైతన్య సమంత జంట ఒకటి అని చెప్పాలి. ఇలా వీరిద్దరూ ఏం మాయ చేసావే సినిమా ద్వారా నటించి ఇదే సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా సెలబ్రిటీ కపుల్ గా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సమంత నాగచైతన్య మూడు సంవత్సరాల పాటు తమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా చివరికి విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఇక సమంత నాగచైతన్య విడిపోతున్నారని తెలిసినప్పటికీ వీరి విడాకులకు గల కారణాలు మాత్రం తెలియలేదు.
ఇలా సమంత నాగచైతన్య విడాకుల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీటి గురించి ఏమాత్రం ఆలోచించని ఈ జంట తమ సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే సమంత నాగచైతన్య విడాకుల గురించి మరిచిపోయిన క్షణంలో ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ట్వీట్ సంచలనం రేపుతుంది.

Nagachaitanya -Samantha: సమంత ప్రెగ్నెన్సీ కూడా పోయిందా…
సమంత నాగచైతన్య విడిపోవడానికి గల కారణం నాగచైతన్య సమంతను చేసిన టార్చర్ కారణమంటూ ఈయన తెలియజేశారు. నాగ చైతన్య సమంతను మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పెట్టారని అతను ఒక బ్యాడ్ హస్బెండ్ అంటూ ఈయన తెలిపారు.చివరికి తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటికీ అబార్షన్ చేయించుకునేలా తను టార్చర్ చేశారంటూ సమంత చెప్పిన విధంగా ఉమైర్ సందు చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ కావడంతో మరోసారి సమంత నాగచైతన్య ఇష్యూ తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో ఇంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.



























