Nagachaitanya: థాంక్యూ సినిమా పోతుందని ముందే తెలుసు… నాగచైతన్య షాకింగ్ కామెంట్స్!

0
31

Nagachaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకాశం కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్య తన గత సినిమా థాంక్యూ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. థాంక్యూ సినిమా పోతుందనే విషయం తమకు ముందుగానే తెలుసు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.విక్రమ్ గారు దిల్ రాజు గారు తాను ముగ్గురు విన్నప్పుడు కథ చాలా బాగుంది ముగ్గురికి ఓకే అయిన తర్వాతనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని తెలిపారు.

ఇక షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు కాస్త తేడా కొట్టిందని నాగచైతన్య తెలిపారు.ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళగానే ఈ సినిమాపై బాగా డౌట్ వచ్చేసిందని ఈ సినిమా తప్పకుండా పోతుందని ఆ క్షణమే అర్ధమైందని నాగచైతన్య తెలిపారు.ఇక సినిమా పోతుందని తెలిసి కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు.

Nagachaitanya: పోతుందని తెలిసి చేతులు దులుపుకోలేము…

కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీసి సినిమా పోతుందని తెలిసి చేతులు దులుపుకోలేము కదా అందుకే అందరం కలిసి సినిమాని ముందుకు నడిపించడం కోసం ప్రయత్నాలు చేసామని నాగచైతన్య ఈ సందర్భంగా థాంక్యూ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత ఎన్నో అంచనాల నడుమ కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా నాగచైతన్యకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.