Nagachaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్న చైతన్య బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తాజాగా తన విడాకులకు గల కారణాలను తెలియజేశారు.

నాగచైతన్య చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా సమంత స్పందిస్తూ కేవలం అహంకారం భయం అనేవి మనల్ని దూరం చేస్తాయి అంటూ కామెంట్ చేయడంతో వీరిద్దరి మధ్య సరైన అవగాహన లేక విడిపోయారని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా నాగచైతన్య మరోసారి తన విడాకుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ మాకు విడాకులు వచ్చి రెండు సంవత్సరాలు అయింది. అయినా ఇప్పటికీ మావిడాకుల గురించి ఈరోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా మీ హెడ్ లైన్స్ కోసం విడాకుల వార్తలను సాగదీయడం తప్పు అంటూ చెప్పుకొచ్చారు. ఇలా విడాకుల గురించి మరోసారి నాగచైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nagachaitanya: రివ్యూస్, కామెంట్స్ చదువుతాను…
ఇక తన సినిమాలు విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి వచ్చే రివ్యూస్ కామెంట్లను తాను చదువుతూ ఉంటానని తెలిపారు. అయితే కొన్నిసార్లు కొన్ని కామెంట్స్ కనుక చదివితే ఎందుకు బ్రతికున్నామా అనే భావన కూడా కలుగుతుందని నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా మే 12న విడుదల కానుంది ఇందులో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించారు.