Roja: సినీనటి మాజీ మంత్రి ఆర్కే రోజా 2024 ఎన్నికల ఫలితాలలో ఘోర ఓటమి పాలయ్యారు. గత రెండుసార్లు నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈమె గత ఎన్నికలలో మంత్రి పదవిని కూడా పొందారు అయితే ఈసారి ఎన్నికలలో కూడా నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేసినటువంటి రోజాకు తీవ్ర నిరాశ ఎదురయింది. ఈమె ఘోరంగా తన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు.

గత ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 151 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది అయితే ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అవుతూ ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇలా వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఘోరంగా ఓడిపోయడంతో వైసిపి అభిమానులు షాక్ లో ఉన్నారు.
ఇక నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి రోజా ఓడిపోవడంతో తన ఓటమిని అంగీకరించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఎక్స్ వేదికగా ఈమె స్పందిస్తూ.. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ..
ఎదురు దెబ్బలే సోపానాలు..
భయాన్ని విశ్వాసంగా… ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్స్ ఈమె పోస్ట్ పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.





























