Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా మ్యూజిక్ నైట్స్ అనే కార్యక్రమాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాను మించి బంగార్రాజు చిత్రం ఉండబోతోందని తెలిపారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదే రోజున అన్నపూర్ణ స్టూడియో కూడా పుట్టిందని నాగార్జున గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ఎంతో అద్భుతమైన సంగీతం అందించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పారు.అసలు నాగార్జున అభిమానులకు ఎందుకు క్షమాపణలు చెప్పారు అనే విషయానికి వస్తే…
కరోనా కారణం వల్ల ఆ కండిషన్ తప్పలేదు…
జనవరి 14వ తేదీ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ వేడుకను ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు.అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకకు అభిమానులను ఎవరిని పిలవడం లేదని అందుకు ప్రతి ఒక్క అభిమానికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు నాగార్జున ఈ వేదికపై తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.































