Nagarjuna-Naga Chaitanya: ప్రస్తుతం ఒక్క తెలుగులోనే కాదు.. మొత్తం సినిమా పరిశ్రమలోనే పాన్ ఇండియా లెవల్లో సినిమాలను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇప్పుడున్న యూత్ లో తెలుగు నుంచి ఆ రుచి చూపించిన వ్యక్తి ఎవరంటే.. దాదాపు ప్రభాస్ అనే చెప్పాలి. అతడి సినిమా బాహుబలి.. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. ప్రపంచలో కొన్ని దేశాల్లో కూడా ఆడింది.

అతడి దారిలోనే అల్లు అర్జున్, చరణ్, తారక్ వెళ్తున్నారు. అందులో బన్నీ పుష్ప సినిమాతో కాస్త ఆ విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి. తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్, తారక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఇలా చేయడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి.

ఒక్క భాషలో నటించి.. డబ్బింగ్ చెబితే చాలు.. ఆ నటనకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా వివిధ భాషల్లో వాటిని విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్క సినిమాతో చాలా భాషల్లో పాపులారిటీ సంపాదించుకోవచ్చు. దీంతో అక్కడ నుంచి మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా రెమ్యూనరేషన్ విషయంలో కూడా.. భారీగా డిమాండ్ చేయవచ్చు. ఇలా ఒక్క సినిమాతోనే ఇలాంటి లాభాలు వస్తుంటే.. హీరోలు మాత్రం ఎందుకు వద్దు అంటారు.. అందుకే తీసే సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లో ఉండే విధంగా ప్రయత్నిస్తున్నారు.
నాగచైతన్య మాత్రం అటువైపు ఆలోచించడం..
అయితే అక్కినేని వారసుడు.. నాగచైతన్య మాత్రం అటువైపు ఆలోచించడం లేదు. ఎందుకంటే అతడు తీసిన సినిమాలే చాలా తక్కువగా ఉన్నాయి. అందులో హిట్ అయినవి కూడా చాలా తక్కువ. దీంతో అతడికి తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ లేదు.. అలాంటిది మిగతా భాషల్లో ఆదరిస్తారా అనేది ప్రశ్నార్థకం.
చైతు ఇంకా యాక్టింగ్, డ్యాన్స్ పరంగా డెవలప్ అవ్వాలి.. నాగ చైతన్య కూడా నేర్చుకుంటున్నాడు. దీనిపై నాగార్జున కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నట్లు సమాచారం. కొడుకుల భవిష్యత్తు ఢీలా పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్నాడట నాగార్జున. మిగతా హీరోలు పెళ్లిళ్లు చేసుకొని.. చక్కగా పాన్ఇండియా సినిమాలు చేస్తుంటే.. ఇక్కడ ఆ రెండు లేవు. అందుకే నాగార్జున తెగ ఫీల్ అవుతున్నాడట. రూ.100 కోట్ల క్లబ్ లోకి రయ్ మంటూ మిగతా హీరోలు దూసుకుపోతుంటే.. రూ.50కోట్ల క్లబ్ లోనే ఉన్నాడు చైతు. చూద్దాం ఫీచర్లో ఏం జరుగుతుందో.































