Nagarjuna: ఇటీవల నాగచైతన్య శోభితల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి ఫోటోలను నాగార్జున ఇదివరకే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలా తన తండ్రి గారి శత జయంతి వేడుకలలో భాగంగా ఆవిష్కరించిన విగ్రహం ముందు తన కొడుకు నాగచైతన్య వివాహం జరగడం చాలా సంతోషంగా అనిపించిందని వీరిద్దరూ సంతోషంగా ఉండాలని శోభిత మా ఇంట్లో ఎంతో సంతోషాన్ని తీసుకువచ్చింది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ విధంగా నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఈయన షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా మీడియా వారికి అభినందనలు తెలిపారు. నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిపోతుంది. మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మమ్మల్ని అర్థం చేసుకొని మా మధురమైన క్షణాలను మరింత ఆనందంగా గడపటానికి స్పేస్ ఇచ్చిన మీడియాకు ధన్యవాదాలు.

Nagarjuna: మీడియా బృందానికి..
మీ ఆలోచనలు మరియు మాపై మీరు చూపించిన గౌరవం మీరు తెలిపిన శుభాకాంక్షలు మా ఆనందాన్ని మరింత పెంచాయి.మా ప్రియమైన స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు నిజంగా మరువలేనిది. నా కొడుకు పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు.. మీరు అందరూ మాతో పంచుకున్న ప్రేమ, అభిమానం మద్దతు కారణంగానే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా మారింది. మీరు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు అక్కినేని కుటుంబం హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.



























