Nagarjuna: బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. ఇక ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై విమర్శలు వెల్లువెత్తుతాయి. గతంలో కూడా ఈ కార్యక్రమం పై ఎంతోమంది విమర్శలు చేయగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే సీపీఐనారాయణ గత సీజన్లో కూడా బిగ్ బాస్ కార్యక్రమం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇది బిగ్ బాస్ కార్యక్రమం కాదని బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని ముంబైలో రెడ్ లైట్ ఏరియాతో పోల్చారు.ఇలా ఈ కార్యక్రమం పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నారాయణ ఈసారి సీజన్ కూడా ప్రసారం అవడంతో మరోసారి నాగార్జున పై మండి పడ్డారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున పట్ల పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా నాగార్జున వెనకాడరు అంటూ కామెంట్ చేశారు.ఇప్పుడు కూడా ఇలాంటి విమర్శలను పట్టించుకోని నాగార్జున ఈసారి నారాయణ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.గత ఆదివారం బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్నటువంటి మెరీనా రోహిత్ దంపతులను కౌగిలించుకోమని చెప్పారు.

Nagarjuna: మీకు లైసెన్స్ ఉంది…
నాగార్జున ఇలా చెప్పేసరికి కాస్త వెనకాడిన ఈ జంటకు నాగార్జున భరోసా ఇస్తూ మీకు లైసెన్స్ ఉంది కౌగిలించుకోండి అంటూ చెబుతూ నారాయణ.. నారాయణ అంటూ వేదికపై నారాయణ పేరు పలికారు. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి అయిన జంట అని కౌగిలించుకోవడంలో తప్పులేదు మరోసారి ఈ సంఘటనపై కామెంట్లు చేయాల్సిన పని లేదంటూ ఈ సందర్భంగా నాగార్జున నారాయణ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని పరోక్షంగా అతని పై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.






























