Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగార్జున ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున నేటిజెన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో భారీగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నాగార్జున అన్ ఫిట్ అంటూ ఈయన ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఇలా ఉన్న ఫలంగా నాగార్జున గురించి ఈ స్థాయిలో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఓ కారణముంది తమిళ బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసినటువంటి కంటెస్టెంట్ అజీమ్ ట్రాన్స్ ఉమెన్ శివానిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు.
ఈ క్రమంలోనే కమల్ హాసన్ ఈ విషయంలో ట్రాన్స్ ఉమెన్ పట్ల స్టాండ్ తీసుకొని కంటెస్టెంట్ అజీమ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇలా కమల్ హాసన్ ట్రాన్స్ ఉమెన్ పట్ల స్టాండ్ తీసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున పై తీవ్రస్థాయిలో ప్రేక్షకులు మండిపడుతున్నారు మీరు ఎప్పుడైనా ఇలా ఎవరికోసమైనా స్టాండ్ తీసుకున్నారా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఈయన తన కొడుకులనే సరిగా సరిదిద్దుకోలేకపోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Nagarjuna: నిజం చెప్పే ధైర్యం లేదు…
నాగార్జున ఎప్పుడూ కూడా మంచిగా ఆడిన కంటెస్టెంట్లను ఒక్కరోజు కూడా పొగడ లేదని, ఈయన ఎప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతుంటారని ఏమాత్రం ధైర్యం లేదు… నాగార్జున పిరికివాడు కనక ధైర్యంగా తప్పును ఎత్తి చూపించలేరంటూ ప్రేక్షకులు టైం చూసి నాగార్జున పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.































