Nagarjuna: ఎన్టీఆర్ లీవ్స్ ఆన్…. ఎన్టీఆర్ వర్ధంతి రోజున నాగార్జున అలా… ఏఎన్ఆర్ వర్ధంతి రోజున బాలయ్య ఇలా?

0
82

Nagarjuna: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వర్సెస్ అక్కినేని అన్నట్టుగా వివాదం చెలరేగుతుంది.నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజున వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం రోజున ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ బాలకృష్ణను తప్పుపడుతున్నారు. ఇక అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్టీఆర్ గురించి నాగార్జున మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు.

నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకోవడంతో ఎన్టీఆర్ వర్ధంతి రోజున సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని నాగార్జున ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరూ కూడా రెండు కళ్ళు లాంటివారని తెలిపారు.

Nagarjuna: ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు లాంటివారు…


తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఆ మహానటులను గుర్తుపెట్టుకుంటారని ఈయన తెలిపారు. ఎన్టీఆర్ లీవ్స్ ఆన్… ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్ అంటూ నాగార్జున ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.కానీ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఏఎన్ఆర్ వర్ధంతి రోజున నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాత్రం అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వీడియోని అక్కినేని అభిమానులు వైరల్ చేస్తూ ఇద్దరికీ ఎంత తేడా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.