తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది.

ఈ ఐదో సీజన్లో ఇప్పటికే 10 వారాలు పూర్తి కావచ్చాయి. 10వ వారంలో విజయవంతంగా యాకర్ రవి కెప్టెన్ అయ్యాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే శనివారం ఈ కార్యక్రమానికి వచ్చిన నాగార్జున సన్నీ, యానీపై కోపం చూపించినట్లు కనిపించింది.
సన్నీ విషయంపై రవి మాట్లాడుతూ.. కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ ఎక్కువగా టంగ్ లూస్ అయ్యాడని.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని .. వెరీ బ్యాడ్ బియేవియర్.. ఇష్టం వచ్చింది చేస్తా.. అంటూన్నాడు అంటూ రవి చెబుతాడు. దానికి సన్నీ నేను అనలేదు అని.. దానికి మానస్ కూడా నాకు వినిపించలేదు అని చెబుతారు. దీనికి నాగార్జున వీడియో ప్లే చేయించి.. తంతా అనే పదం వాడావు అంటూ నిరూపిస్తాడు.
దానికి యాని ఇంటెన్షన్ గా అనలేదు.. ఆ పదం బ్రిక్స్ ను తంతా అని వాడి ఉండొచ్చు అంటూ సన్నీని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయాగా.. నాగార్జున ఆమెకు కౌంటర్ ఇస్తాడు. కోపంలో ఏది చెప్పినా ఓకె.. కాజల్ చెబుతున్న బేవకూప్ కూడా కరెక్టే కదా అంటూ చెబుతాడు నాగార్జున. దీంతో ఒక్కసారిగా యానీ మాస్టార్ షాక్ కు గురవుతుంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఎక్కవుగా సన్నీ, యానీని ఆడేసుకున్నట్లు కనపడుతోంది.































